ETV Bharat / snippets

ఏడాదిలోపే కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం- విపక్షాలు ఫైర్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 27, 2024, 8:09 AM IST

Shivaji statue collapses in Maharashtra
Shivaji statue collapses in Maharashtra (ANI)

Shivaji statue collapses in Maharashtra :మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం కుప్పకూలిపోయింది. రాజ్​కోటలో 35 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం సోమవారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. దీనిని గతేడాది డిసెంబరు 4న నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో గత మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగానే విగ్రహం కూలినట్లు భావిస్తున్నామని, అసలు కారణాన్ని నిపుణులు త్వరలోనే వెల్లడిస్తారని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనపై భారత నావికాదళం విచారణకు ఆదేశించింది. అలాగే విగ్రహాన్ని పునరుద్ధరించడానికి తక్షణమే చర్యలు ప్రారంభించేలా ఓ టీమ్​ను ఏర్పాటు చేసింది. తొమ్మిది నెలలు కూడా పూర్తికాకుండానే విగ్రహం కూలిపోవడం పట్ల ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రప్రభుత్వానికి ప్రచారం మీద ఉన్న దృష్టి, నాణ్యత మీద లేదని ధ్వజమెత్తాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.