ETV Bharat / snippets

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఫిక్స్- 'నిర్మలమ్మ పద్దు' ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 4:37 PM IST

Parliaments Budget Session 2024
Parliaments Budget Session 2024 (Sansad TV / GettyImages)

Parliaments Budget Session 2024 : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్​ను జులై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో ప్రవేశపెట్టనున్నారు.

ఎన్నికల ఏడాది కావడం వల్ల 2024 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటం వల్ల పూర్తి స్థాయి బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే కానుంది. కాగా, ప్రధాని మోదీ, నిర్మలమ్మకు ఆర్థిక మంత్రిగా 3.0 సర్కార్​లో కూడా అవకాశం ఇచ్చారు. నిర్మలమ్మ జులై 23న ప్రవేశపెట్టబోయే బడ్డెట్​పై వేతన జీవులు, పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, రైతులు ఆశలు పెట్టుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.