ETV Bharat / snippets

కేరళలో నిపా వైరస్​ కలకలం- వ్యాధి సోకిన గంటల వ్యవధిలోనే బాలుడు మృతి

Kerala Nipah VIRUS  Death
Kerala Nipah VIRUS Death (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 2:52 PM IST

Kerala Nipah Virus Death : కేరళలో నిపా వైరస్‌ సోకిన 14ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. అతడికి నిపా వైరస్‌ సోకినట్లు నిర్ధరించిన కొన్ని గంటల వ్యవధిలోనే మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

మళప్పురం జిల్లాలోని పండిక్కడ్‌కు చెందిన 14ఏళ్ల బాలుడికి నిపా వైరస్‌ సోకినట్లు శనివారం వెల్లడించిన వీణా జార్జ్‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఈ విషయాన్ని నిర్ధరించిందని, ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఆ బాలుడు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. బాధితుడిని కోజికోడ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించనున్నట్లు తెలిపారు. అతడికి ఎవరెవరు దగ్గరగా వచ్చారన్నది ఆరా తీస్తున్నట్లు వివరించారు. ఇంతలోనే బాలుడు మృతిచెందాడు. అంతర్జాతీయ నిబంధనలు పాటించి అంత్యక్రియలు నిర్వహిస్తామని వీణాజార్జ్​ చెప్పారు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్‌ మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.