ETV Bharat / snippets

కర్ణాటక సీఎంకు షాక్- ముడా స్కామ్​లో సిద్ధరామయ్య విచారణకు గవర్నర్ పర్మిషన్

Karnataka CM To Be Prosecuted
Karnataka CM To Be Prosecuted (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 11:44 AM IST

CM Siddaramaiah To Be Prosecuted : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చిక్కుల్లో పడ్డారు. మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార సంస్థ-ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రిని విచారించేందుకు రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. ముడా స్థల కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం పాత్ర ఉందని ముగ్గురు వ్యక్తులు పిటిషన్‌ దాఖలు చేసినట్లు రాజ్​భవన్​ వర్గాలు తెలిపాయి.

ముడాలో అవకతవకలపై సీఎం సిద్ధరామయ్యను విచారించాలంటూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు టీజే అబ్రహం వేసిన పిటిషన్‌పై గవర్నర్‌ నోటీసులు జారీ చేశారు. కోట్లాది రూపాయల కుంభకోణం వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని అబ్రహం తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో సిద్ధరామయ్య భార్య బిఎమ్ పార్వతికి చట్టవిరుద్ధంగా మైసూరులోని పలు ప్రాంతాల్లో 14 చోట్ల స్థలాల కేటాయింపులు జరిగాయని తెలిపారు. దీనివల్ల ఖజానాకు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని అబ్రహం ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.