Kanwariyas Accident : బిహార్ బంకా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కన్వరియాలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. ఫులిదుమర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కన్వరియాలు(శివభక్తులు) సుల్తాన్‌గంజ్ నుంచి జస్త్ గౌర్ నాథ్ మహదేవ్ ఆలయానికి వెళ్తున్న క్రమంలో ట్రక్కు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లిందని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఘటనపై ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. స్థానికుల రాళ్లదాడిలో కొందరు పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. స్థానికులు అంబులెన్స్‌పై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది.
'కావడి' యాత్రికులపైకి దూసుకెళ్లిన ట్రక్- ఐదుగురు మృతి
Published : 2 hours ago