ISRO Set To Launch Earth Observation Satellite-8 On August 15 : ఆగస్టు 15న భూపరిశీలన ఉపగ్రహం (ఈవోఎస్)-8ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన వర్గాలు తెలిపాయి. ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంఛ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ)-డి3 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపనున్నట్లు వివరించాయి. ఒక మైక్రోశాటిలైట్‌ను రూపొందించడం, దానిలో ఇమిడిపోయే పరిశోధన పరికరాలను అభివృద్ధి చేయడం ఈవోఎస్-8 మిషన్ ఉద్దేశమని తెలిపాయి. ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రోఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ పేలోడ్ (ఈవోఐఆర్), గ్లోబల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ పేలోడ్ (జీఎన్‌ఎస్‌ఎస్-ఆర్), ఎస్‌ఐసీ యూవీ డోసీమీటర్ అనే మూడు పరికరాలు ఉంటాయి. వీటి ద్వారా విపత్తులు, పర్యావరణం, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ వంటివి చేపట్టవచ్చు.
ఆగస్టు 15న ఇస్రో భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం!
Published : Aug 7, 2024, 6:44 AM IST