ETV Bharat / snippets

'బడ్జెట్​లో విపక్ష రాష్ట్రాలపై వివక్ష' - పార్లమెంట్‌లో నిరసనకు ఇండియా కూటమి రె'ఢీ'

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 6:47 AM IST

India Bloc On Budget 2024
India Bloc On Budget 2024 (ANI)

India Bloc On Budget 2024 : కేంద్ర వార్షిక బడ్జెట్​లో విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలపై వివక్ష చూపారని ఇండియా కూటమి ధ్వజమెత్తింది. ఎన్​డీఏ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పార్లమెంటు లోపలా, వెలుపలా బుధవారం నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం నిర్వహించిన ఇండియా కూటమి పార్టీల ఫ్లోర్‌ లీడర్ల సమావేశంలోఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశాన్ని దెబ్బతీశారని, చాలా రాష్ట్రాలకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఎన్​డీఏ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ నెల 27న జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరిస్తారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.