Four Army Personnel Killed In Road Accident : సిక్కింలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. బంగాల్లోని పెడాంగ్ నుంచి సిక్కింలోని జులుక్ వైపు వెళ్తుండగా అదుపుతప్పి 700 అడుగుల లోతైన లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. సిల్క్ రూట్‌గా ప్రసిద్ధి చెందిన రెనోక్ రోంగ్లీ రాష్ట్ర హైవేపై ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతులను డ్రైవర్ ప్రదీప్ పటేల్ , క్రాఫ్ట్‌మన్ డబ్ల్యూ పీటర్, నాయక్ గురుసేవ్ సింగ్ , సుబేదార్ కె.తంగపాండిగా గుర్తించారు. వీరంతా బంగాల్లోని బినాగురి యూనిట్‌కి చెందిన సైనిక సిబ్బందిగా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఘోర రోడ్డు ప్రమాదం- లోయలో పడ్డ వాహనం- నలుగురు సైనికులు మృతి
Published : Sep 5, 2024, 7:37 PM IST