Shirdi Sai Baba Hundi Collection : మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా సాయిబాబాను సుమారు 4లక్షల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారని షిర్డీ సాయిబాబా సంస్థాన్ సీఈఓ గోరక్ష్ గాడిల్కర్ వెల్లడించారు. భక్తుల నుంచి సాయిబాబా ఆలయానికి దాదాపు రూ.6.25 కోట్ల విరాళాలు వచ్చాయన్నారు. వీటిలో రూ.1.20 కోట్ల డొనేషన్లను సాయి మందిరంలోని కౌంటర్‌లో, రూ.2.53 కోట్ల డొనేషన్లను హుండీ ద్వారా సాయి భక్తులు అందించారని ఆయన తెలిపారు. మరో రూ.1.95 కోట్లను ఆన్‌లైన్, చెక్కులు, డీడీ ద్వారా భక్తులు సాయిబాబా ఆలయానికి ఇచ్చారని గోరక్ష్ గాడిల్కర్ చెప్పారు. రూ.8 లక్షలు విలువైన బంగారం, రూ.2.70 లక్షలు విలువైన 5 కేజీల వెండిని కూడా భక్తులు సాయిబాబా ఆలయానికి విరాళంగా అందించారన్నారు. గత మూడు రోజుల వ్యవధిలో 205 మంది సాయి భక్తులు రక్తదానం కూడా చేశారని ఆయన వివరించారు.
షిర్డీ సాయిబాబాకు భారీగా కానుకలు- గురు పూర్ణిమకు 3రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Published : Jul 24, 2024, 4:53 PM IST