ETV Bharat / snippets

'చాందీపురా' వైరస్‌తో నాలుగేళ్ల బాలిక మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 7:50 AM IST

Chandipura Virus In Gujarat
Chandipura Virus In Gujarat (ETV Bharat)

chandipura virus Death : గుజరాత్‌లో చాందీపురా వైరస్‌ సోకడం వల్ల నాలుగేళ్ల బాలిక మృతి చెందిందని రాష్ట్ర అధికారులు నిర్ధారించారు. ఆ వైరస్‌ కారణంగా నమోదైన తొలి మరణం ఇదేనని వెల్లడించారు. నాలుగేళ్ల బాలక నమూనాలను పరీక్షించిన పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్​ఐవీ) ఆమెకు వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ఇప్పటి వరకు గుజరాత్​లో 29 మందికి చాందీపురా వైరస్​ సోకిందని అనుమానిస్తున్నారు. అయితే వారిలో 14 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. వారి నమూనాలు ఎన్​ఐవీకి పంపినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాప్తి ఇది చెందుతుంది. చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.