Assam Floods Death Toll : అసోంలో వరదలు భీకరరూపం దాల్చాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో ఇప్పటివరకు 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి కరీంగంజ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందినట్లు చెప్పారు. మృతుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 'కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాలతో 15 జిల్లాలోని సుమారు 1.61 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నదులు, కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల రహదారులు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొత్తం 470 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద తాకిడికి సుమారు 1380 హెక్టార్ల పంట నష్టపోయింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో సహయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 5 వేల పైగా పౌరులు సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు' అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అసోంను ముంచెత్తిన వరదలు- 26మంది మృతి- 1.61లక్షల మందికి తీవ్ర ఇబ్బందులు
Published : Jun 19, 2024, 2:29 PM IST