రసాభాసగా జిల్లా పరిషత్ సంఘ సమావేశం- వాకౌట్​ చేసిన జడ్పీటీసీలు - జిల్లా పరిషత్ సంఘ సమావేశం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 4:28 PM IST

Zilla Parishad Level community Meeting in Confusion: అనంతపురంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్‌ స్థాయి సంఘం సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. జడ్పీ డిప్యూటీ సీఈవో లలితాబాయి తీరుకు నిరసనగా జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పాటు జడ్పీటీసీలు వాకౌట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా జడ్పీ ఛైర్‌పర్సన్‌, ఉప సీఈవో మధ్య ప్రోటోకాల్‌, నిధుల మంజూరు విషయంలో వివాదం నెలకొంది. చేసిన పనులకు ఉప సీఈవో బిల్లులు చెల్లించడం లేదని జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌ఛార్జ్‌ సీఈవో ఉన్న జాయింట్ కలెక్టర్ కేతన్‌గార్గ్ బోగస్ సంస్థలకు రెండు కోట్ల బిల్లు మంజూరు చేశారని జడ్పీటీసీ సభ్యులు ఆరోపించారు.

Councilors General Meeting in Rasabhasa: జిల్లాలోని గుత్తి మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన కౌన్సిలర్ల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. ప్రజలకు తాగునీరు అందించడంలో వైసీపీ మున్సిపల్‌ ఛైర్మన్‌ వన్నూర్‌ బీ, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు. ప్రతి సమావేశంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండాకాలం మొదలవడంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతారని పేర్కొన్నారు. తాగునీరు అందించకపోతే ఎన్నికల్లో ప్రజల ముందుకు ఎలా వెళ్లాలని కౌన్సిలర్లు మున్సిపల్‌ ఛైర్మన్​ను ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.