వైఎస్సార్సీపీ నేత మధ్య విభేదాలు- శిలాఫలకాల ధ్వంసానికి దారితీసిన వర్గపోరు - YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 7:08 PM IST
YSRCP factions battle: అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైఎస్సార్సీపీ నాయకుల మధ్య వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ అమర్నాథ్ రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. అయితే ఇటీవల వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మేడాకు కాకుండా, అధిష్టానం అమర్నాథ్ పేరును ప్రకటించింది. ఒంటిమిట్ట మండలం గంగపేరూరులో 15 లక్షల 74 వేల రూపాయల వ్యయంతో చేపట్టిన పాల సేకరణ కేంద్రం, డిజిటల్ లైబ్రరీని మల్లికార్జున రెడ్డి ప్రారంభోత్సం చేయనున్నారు.
ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, ఈరోజు తెల్లవారుజామున శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రారంభోత్సవం జరిగే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇరు వర్గాల గొడవల నేపథ్యంలో రేపు జరగబోయే ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా ఉండబోతుందనే అంశంపై నియోజకవర్గంలో చర్చలు ప్రారంభమయ్యాయి.