వ్యక్తిపై కర్రలతో దాడిచేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు - వైఎస్సార్సీపీ నేతల దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 10:44 PM IST

YSRCP leaders attacked a person: వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. నిన్న మెున్నటి వరకూ పత్రికా విలేకరులపై దాడులకు తెగబడ్డ వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తాజాగా సామాన్య జనంపై సైతం తమ జులూం చూపిస్తున్నారు. ఓ వ్యక్తి బైకుతో  రోడ్డుపై వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి కారణం అయ్యాడని, ఆ వ్యక్తిపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి తెగబడిన ఘటనలో  అతడికి తీవ్ర గాయాలయ్యాయి. 

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం యర్రబాలెం వద్ద కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోటేశ్వరరావు అనే వ్యక్తిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ కోటేశ్వరరావును స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావటంతో మెరుగైన చికిత్స కోసం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రోసూరులో జరుగుతున్న వైఎస్సార్సీపీ  బీసీ ఆత్మీయ సదస్సుకు వెళ్తున్న వారి వాహనాన్ని సత్తెనపల్లి నుంచి వస్తున్న తన వాహనం ఢీ కొనటంతో మూకుమ్మడిగా తనపై వైఎస్సార్సీపీ  జెండా కర్రలతో దాడి చేశారని బాధితుడు తెలిపాడు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.