ఎన్నికల విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల వైఎస్సార్సీపీ శ్రేణుల దురుసు ప్రవర్తన - YSRCP Leaders Abused Woman - YSRCP LEADERS ABUSED WOMAN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/640-480-21458560-thumbnail-16x9-ysrcp-leaders-abused-woman-employee.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 5:02 PM IST
YSRCP Leaders Abused Woman Employee : పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని పట్ల వైఎస్సార్సీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించారు. ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. దీంతో మహిళా ఉద్యోగిని కన్నీటి పర్వంతమయ్యారు. నా విధులు నేను నిర్వర్తిస్తుండగా వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని వాపోయారు. ఇంత కష్టపడి విధులు నిర్వర్తిస్తుంటే మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా చులకనగా మాట్లాడారని వాపోయారు.
ఇంతలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అక్కడికి చేరుకుని మహిళా ఉద్యోగితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుని భయపడవద్దు, నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. మీ విధులు మీరు తప్పకుండా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఆమెను కోరారు. మహిళా ఉద్యోగి పట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవర్నీ వదలకుండా దుశ్చర్యలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.