Supreme Court Judge About Judicial Services: పిటిషన్ల కోసం కోర్టుకు వచ్చే వారికి అన్ని విధాల సహకరించి సేవలు అందించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకట్ నారాయణ భట్టి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె కోర్టు సముదాయం ఆవరణలో సీనియర్ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును ఆయన ప్రారంభించారు. కోర్టు ఆవరణలో ఉన్న గంగమ్మను ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు.
న్యాయవ్యవస్థలో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని దీన్ని అందిపుచ్చుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సరస వెంకట్ నారాయణ భట్టి న్యాయవాదులకు సూచించారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారికి తోడ్పాటు అందించాలని తెలిపారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కుటుంబం సభ్యుల సహకారముందని అని తెలిపారు. అన్ని సౌకర్యాలతో కూడిన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
High Court CJ About Judicial Services: ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి నిర్వర్తించడం అలాగే న్యాయమూర్తి తీర్పును వెలువరించడం అంత సులభతరం కాదని తెలిపారు. మదనపల్లి నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా వెంకటనారాయణ బట్టి ఎదగడం ఎంతో ఆనందించాల్సిన అంశం అన్నారు. ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను చాలావరకూ తగ్గించామని అలాగే జిల్లా కోర్టుల్లో కూడా కేసు తగ్గించడానికి కృషి చేయాలన్నారు.
''న్యాయవ్యవస్థలో గతంలో కంటే ఇప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. దానిని అందిపుచ్చుకొని న్యాయవాదులు మెరుగైన ఫలితాలు సాధించాలి. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారికి తోడ్పాటు అందించాలి. అన్ని సౌకర్యాలతో కూడిన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది''- సరస వెంకట్ నారాయణ భట్టి,సుప్రీంకోర్టు న్యాయమూర్తి
'జ్యుడీషియల్ సర్వీసు పరీక్షల వాయిదా సరికాదు'
అధికారులు జడ్జిలు కాలేరు- ఇళ్లను కూల్చివేసే రైట్స్ లేవ్: సుప్రీంకోర్టు