TDP Leaders On Karnataka Projects in Tungabhadra River : కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపట్టనున్న నిర్మాణాలను ఆపాలని టీడీపీ నేత తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. తుంగభద్ర నదిపై రెండు నిర్మాణాలు చేపట్టేందుకు టెండర్లు పిలిచారని దీని వల్ల కర్నూలు జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. రాయచూరు జిల్లా చీకలపల్లి నుంచి మంత్రాలయం నియోజకవర్గం మీదుగా కుంబలనూరు వరకు బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణం చేపట్టేందుకు కర్నాటక ప్రభుత్వం టెండర్లు పిలించిందని గుర్తు చేశారు. దీని వల్ల తుంగభద్ర నదిపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టులకు నీరు ఉండవన్నారు. అలాగే తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. వెంటనే ఆ పనులను ఆపాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జగన్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆ పార్టీ సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు.
"కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపడుతున్న కట్టడాలతో కర్నూలు జిల్లా ఎడారిగా మారుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే టెండర్లు కూడా పిలిచారు. రాయచూరు జిల్లా చీకలపల్లి నుంచి మంత్రాలయం మీదుగా కుంబలనూరు వరకు బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. అందులో భాగంగా తక్కువ మోతాదులో నీటిని నిల్వచేసుకుంటామని చెప్పి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 20 వేల ఎకరాలకు నీటిని అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం డిజైన్ చేసింది. దీనివల్ల తుంగభద్ర నది కింద ఉన్న అనేక ప్రాజెక్టులు నీరు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వర్షాలు లేకపోతే చివరికి తాగేందుకు కూడా నీరు ఉండని పరిస్థితి ఏర్పాడుతుంది." - తిక్కారెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు
ప్రమాదంలో తుంగభద్ర క్రస్ట్ గేట్లు! - పోటెత్తుతున్న వరద - అధికారుల్లో ఆందోళన
'ఏం చేయాలో రెండేళ్ల నుంచే ప్లాన్' - ఇంజనీరింగ్ అద్భుతం సృష్టించిన కన్నయ్యనాయుడు