'నాకు చెప్పకుండా కాలనీలో లైట్లు పెడతార్రా'- తొలగించిన వైఎస్సార్సీపీ నేత - YSRCP Leader Remove Street Lights - YSRCP LEADER REMOVE STREET LIGHTS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 11, 2024, 9:49 AM IST
Kalyandurgam YSRCP Leader Remove Street Lights : సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయినా వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో తనకు చెప్పకుండా విద్యుత్ దీపాలు పెట్టారని వైసీపీ కౌన్సిలర్ భర్త వాటిని తొలగించేశారు. విద్యానగర్ కాలనీలో గత కొంతకాలంగా వీధి దీపాలు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వారు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు.
Street Lights problems in Kalyandurgam : దీంతో పలువురు ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కార్యకర్తలతో చెప్పి కాలనీలో లైట్లు ఏర్పాటు చేయించారు. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సుదీప్తి భర్త సుధీర్ మున్సిపల్ సిబ్బందితో చెప్పి లైట్లను తీసివేయించారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వీధి దీపాలు వేయించారని గంటలోనే వాటిని తొలగించారని స్థానికులు పేర్కొన్నారు. రాత్రిపూట తాము కాలనీలో ఎలా తిరగాలని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ సిబ్బంది స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.