టీడీపీలోకి చేరిన వైఎస్సార్సీపీ కుటుంబాలు - పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు - Rayadurgam YCP to TDP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-02-2024/640-480-20814344-thumbnail-16x9-ysrcp-to-tdp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 5:43 PM IST
YSRCP Families Join TDP in Anantapur District : అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వీరందరికీ కాల్వ శ్రీనివాసులు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు చూడలేక పార్టీని మారుతున్నామని శ్రేణులు తెలిపారు.
Rayadurgam : సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. జగన్ అయిదేళ్ల పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాయదుర్గం ఎమ్మెల్యేగా తనని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని అఖండ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.