అధికారం అండతో మా పట్టాలు రద్దు చేయించారు : ప్రజాదర్బార్​లో​ వంశీ బాధితులు - EX MLA Vamsi Victims Meet CM - EX MLA VAMSI VICTIMS MEET CM

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 3:22 PM IST

YSRCP EX MLA Vamsi Victims Meet CM Chandrababu at NTR Bhavan : తమ పట్టాదారు పాస్ పుస్తకాలను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రద్దు చేయించారని కేసరపల్లి వాసులు సీఎం చంద్రబాబుకు ప్రజాదర్బార్​లో ఫిర్యాదు చేసారు. మాజీ మున్సిపల్ కమిషనర్ సాయంతో తమకు చెందిన 6 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లినా, అధికారం అండతో తమకు న్యాయం జరగకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతిఒక్కరి వద్దకెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.