'టీడీపీ వేధింపులతోనే యువతి మృతి' - మిస్సింగ్‌ కేసులో వైసీపీ చీప్ ట్రిక్స్ - YCP Tricks in Woman Missing Case - YCP TRICKS IN WOMAN MISSING CASE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2024, 10:36 PM IST

YSRCP Cheap Tricks in Woman Missing Case: పల్నాడు జిల్లాలో యువతి అదృశ్య ఘటన మలుపు తిరిగింది. తాను చనిపోలేదని, బతికే ఉన్నానంటూ ఆ యువతి వాళ్ల కటుంబసభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లుకు చెందిన మనీషా ఇటీవల కనిపించకుండా పోయింది. మనీషా చెప్పులు, చున్నీ, ఓ లెటర్‌ను సాగర్‌ కాలువ వద్ద గుర్తించారు. తెలుగుదేశం నాయకుల వేధింపులు తట్టుకోలేకే మనీషా చనిపోయిందని స్థానిక గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆరోపిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని నిరూపిస్తూ మనీషా ఇవాళ ఇంటికి చేరుకుంది. నరసరావుపేటలోని బంధువుల ఇంట్లో ఆ యువతి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మనీషాను కిడ్నాప్‌ చేసి కాసు మహేష్‌రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై బురద జల్లాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. ఇప్పటికైన తీరు మార్చుకోవాలని కాసు మహేష్‌రెడ్డిని తెలుగుదేశం నాయకులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.