గన్నవరంలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఓవరాక్షన్​ - తోసేసి మరీ పోలీసులతో వాగ్వాదం - YSRCP Activists Misbehaved Police

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 31, 2024, 9:46 AM IST

thumbnail
పోలీసులపై వైఎస్సార్సీపీ శ్రేణుల దురుసు ప్రవర్తన (ETV Bharat)

YSRCP Activists Misbehaved in Gannavaram Police : కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పోలీసుల పట్ల వైఎస్సార్సీపీ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు. బెంగళూరు నుంచి గన్నవరం విమానశ్రయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారికి సెక్యూరిటీగా గన్నవరం ఎస్సై వచ్చారు. జగన్​ ఎయిర్​పోర్ట్​ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆ పార్టీ శ్రేణులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

YSRCP Rude Behaviour in Police : జగన్ బందోబస్తుకు వచ్చిన పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఎస్సైని వారు పక్కకు తోసేశారు. అంతటితో ఆగకుండా ఆయన భుజం మీద చేయి వేసి గొడవకు దిగారు. దీంతో కాసేపు అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకునేందుకు గన్నవరం పోలీసులు ప్రయత్నించారు. అయితే వైఎస్సార్సీపీ కార్యకర్తలు పోలీసులను పక్కకు నెట్టివేసి జగన్ కాన్వాయ్ వెంట వేరే కారులో పరారయ్యారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.