నిందితుడికి అండగా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగునా?: వివేకా సతీమణి సౌభాగ్యమ్మ - YS Sowbhagyamma Sunitha Interview - YS SOWBHAGYAMMA SUNITHA INTERVIEW

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 2:22 PM IST

YS Sowbhagyamma Sunitha Interview: వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డిని నిందితుడి జాబితాలో సీబీఐ చేర్చినా జగన్ మోహన్ రెడ్డి ఆయనకే అండగా మాట్లాడటం సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి తగునా అని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థపైనే నమ్మకం లేని జగన్, నిందితుడు చెప్పిందే నిజమనే విధంగా మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ కుటుంబం తప్పు చేసి ఉంటే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు. షర్మిలను దేవుడే కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడికి పంపించారని అన్నారు. షర్మిలను ఎంపీ చేయాలన్నది వివేకానందరెడ్డి కల అని, పులివెందుల ప్రజల దాన్ని తప్పకుండా నెరవేర్చాలని సౌభాగ్యమ్మ విజ్ఞప్తి చేశారు. 

నేరం చేసిన వారిని వదిలిపెట్టి, తమ కుటుంబంపైనే అభాండాలు వేస్తున్న జగన్ మోహన్ రెడ్డి తాను తప్పు చేసి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని సునీత ప్రశ్నించారు. ఈ కేసులో అనేక ప్రశ్నలు మిగిలి ఉన్నాయని, వాటన్నిటికీ సీబీఐ విచారణలో బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు. వివేకానందరెడ్డి చివరి కోరిక షర్మిలను కడప ఎంపీగా చూడటం అని, తప్పకుండా ఈ ఎన్నికల్లో జరిగి తీరుతుందంటున్న సౌభాగ్యమ్మ, సునీతతో మా ప్రతినిధి ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.