LIVE: కడపలో షర్మిల మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Press Meet in Kadapa - YS SHARMILA PRESS MEET IN KADAPA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 3:55 PM IST
|Updated : May 10, 2024, 4:14 PM IST
YS Sharmila Press Meet in Kadapa LIVE: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడపలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల రోడ్ షోలో పాల్గొన్న ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో షర్మిలతో పాటుగా సునీత, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ సైతం పాల్గొన్నారు. న్యాయం కోసం జగన్ చెల్లెళ్లు ఒక వైపు - భారతి బంధువులు ఒక వైపు నిలబడ్డారని షర్మిల పేర్కొన్నారు. చెల్లి కన్నా భార్య తరఫు బంధువులు జగన్‌కు ఎక్కువయ్యారా? అని ప్రశ్నించారు. అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడని జగన్ కాపాడుతున్నారట, అవినాష్‌ను అంతలా కాపాడడానికి కారణం ఎంటో చెప్పాలన్నారు. వివేకా కంటే జగన్‌కు అవినాష్‌రెడ్డి ఎక్కువయ్యారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఒక కజిన్‌కి ఇంకో కజిన్‌కి మధ్య జరుగుతున్న పోరాటం అంటున్నాడు, కానీ, ఇది సొంత చిన్నాన్న గురించి జరుగుతున్న పోరని షర్మిల తెలిపారు. న్యాయం కోసం జరుగుతున్న పోరాటమన్నారు. ప్రస్తుతం కడపలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : May 10, 2024, 4:14 PM IST