మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్​ - ఇంటి గోడను ఢీకొన్న కారు - YOUNG PEOPLE HIT CAR WOMAN Injured - YOUNG PEOPLE HIT CAR WOMAN INJURED

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 9:28 PM IST

Young People Drink And Drive Hit the Wall Woman Injured: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కారు నడిపి ఓ ఇంటి గోడను ఢీకొట్టారు. ఈ ఘటనలో సుగుణమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం ఆమెను ఆటోలో పిడుగురాళ్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో దాచేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు నలుగురు యువకులతో పాటు కారును సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై పోలీసులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం రోడ్డులో నుంచి అతివేగంగా కారును నడుపుకుంటూ వచ్చి గోడను ఢీకొట్టారని స్థానికులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు యువకులను విచారిస్తున్నారు. మద్యం సేవించి గ్రామంలో నిర్లక్ష్యంగా కారు నడపటం చాలా దారుణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.