రామాపురం బీచ్​లో విషాదం -సముద్రపు గల్లంతైన విద్యార్థి మృతి - Young Man Dead Caught Sea Waves - YOUNG MAN DEAD CAUGHT SEA WAVES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 6:59 PM IST

Young Man Dead After Caught in Sea Waves: సముద్రపు అలల్లో చిక్కుకుని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్​లో చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన నలుగురు యువకులు ద్విచక్ర వాహనాలపై రామాపురం సముద్ర తీరానికి వచ్చారు. నలుగురు సముద్రంలో స్నానం చేస్తుండగా ఒక్కసాకరిగా అలల తాకిడి ఎక్కువ కావడంతో, కనగళ్ల గౌరీష్ అల్లల్లో చిక్కుకొని మృతి చెందాడు. చనిపోయిన గౌరీష్​ తాడేపల్లిగుడెంలో నివసించేవాడని అతని స్నేహితులు తెలిపారు.

చెన్నెలో ఒక ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నట్లు స్నేహితులు తెలిపారు. చెన్నై నుంచి విజయవాడ స్నేహితుల దగ్గరకు గౌరీష్ వచ్చాడు.​ తామంతా కలసి సరదగా గడిపెందుకు రామాపురం వచ్చామని ఇంతలోనే ఈ విషాదం జరిగిందని స్నేహితులు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.