టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే- ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ - Clash between TDP YCP leaders

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 9:16 AM IST

YCP MLA Once Again Tried to Attack TDP leaders: ఏలూరు జిల్లా దెందులూరు సర్వజన ఆసుపత్రి వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే పెదవేగి మండలం కొప్పాకలో ఈ నెల 11వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేసి ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడిన బాధితులు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ దాడిలో గాయపడ్డ పలువురిని పరామర్శించటానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆస్పత్రికి వచ్చారు. 

అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకొని తన అనుచరగణంతో కలిసి టీడీపీ శ్రేణులపై దాడికి యత్నించారు. అదే సమయంలో ఎమ్మెల్యే టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని గొడవను అదుపు చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.