చంద్రబాబు 'రా కదలిరా' సభను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రపన్నుతోంది: ఏలూరి సాంబశివరావు - టీడీపీ రా కదలిరా సభ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-02-2024/640-480-20764729-thumbnail-16x9-ycp-leaders-trying-stop-ra-kadali-ra-party-meeting.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 16, 2024, 1:53 PM IST
YCP Leaders Trying Stop The Ra Kadali ra Party Meeting: బాపట్ల జిల్లా ఇంకొల్లులో శనివారం నిర్వహించనున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'రా కదలిరా' సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకాలు, అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సభ అనుమతి కోసం కలెక్టర్, ఎస్పీలకు సమాచారం అందించినట్లు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ఎలాగైనా సభకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతో రాత్రి సమయంలో సభాస్థలికి పోలీసులు చేరుకుని పూర్తిస్థాయిలో పనుల నిర్వహణకు అనుమతులు లేవని ఆపేయాలన్నారు. విషయం తెలుసుకుని పెద్దసంఖ్యలో టీడీపీ నేతలు అక్కడకు వెళ్లటంతో పోలీసులు మిన్నకుండిపోయారు. రైతుల అంగీకారంతోటే సభ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పనులు యధావిధిగా కొనసాగించారు.
హెలిపాడ్ నిర్మాణం, సభా వేదిక తదితర పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. దాదాపు లక్ష మందికి పైగా సభలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ప్రాంగణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంబశివరావు సిబ్బందికి పలు సూచనలు చేశారు.