ఒడిశా బ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ నేతల బెదిరింపు కాల్స్- రాష్ట్రం నుంచి తరిమేస్తామని హెచ్చరిక - YCP Leaders Threatening Calls - YCP LEADERS THREATENING CALLS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 27, 2024, 12:40 PM IST
YCP Leaders Threatening Calls from Odisha Brahmins : ఒడిశా బ్రాహ్మణులు, మార్వాడీలకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజమహేంద్రవరం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తూ అసభ్యపదజాలంతో దూషిస్తున్నారని మండిపడ్డారు. వాసుతో కలిసి బాధితులు ఎస్పీ జగదీష్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఒడిశా రాష్ట్రాల నుంచి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై వైసీపీ అభిమానులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆదిరెడ్డి వాసు ధ్వజమెత్తారు. ఒడిశా నుంచి వంద కుటుంబాలు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిన్న రాత్రి ( మంగళవారం) అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తొక్కి చంపేస్తామని వైసీపీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల వారు ఇక్కడ వ్యాపారాలు చేయకూడదంటూ ఎంపీ మార్గాని భరత్ రామ్ పేరు రెండు సార్లు ప్రస్తావించనట్లు బాధితులు తెలిపారు. వాస్తవాలను తొందరల్లో వెల్లడించవలసిందిగా ఎస్పీకి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. న్యాయం జరిగేంతవరకు బాధితులకు అండగా ఉంటామని ఆదిరెడ్డి వాసు భరోసానిచ్చారు.