రాజీనామాచేసి పార్టీలోకి రండి-అధికారంలోకి రాగానే పునరుద్ధరణ!వాలంటీర్లకు వైసీపీ ఎర - YCP Leaders meeting - YCP LEADERS MEETING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 9:55 AM IST
YCP Leaders Secret Meeting With Volunteers in Eluru District : నామినేషన్ల పర్వం కొనసాగుతున్న వేళ వైసీపీ నేతలు వాలంటీర్లను అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి చేయడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు జిల్లా భైరవపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో మండవల్లి ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లతో వైసీపీ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారని సీఎం జగన్‌పై కృతజ్ఞతతో మిగిలిన వాలంటీర్లంతా రాజీనామా చేసి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చారు.
రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్లీ నియామిస్తామని అధికార నేతలు వాగ్దానాలు చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే వైసీపీ నాయకులు సమావేశం జరుగుతున్నా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులు ఎవరూ నాయకుల సమావేశాలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన వద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించిన లెక్కచేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.