నెల్లూరు జిల్లాలో పెట్రేగిపోతున్న భూ ఆక్రమణలపై వైసీపీ కౌన్సిలర్ ఆగ్రహం - ycp leaders occupied lands
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-03-2024/640-480-20945558-thumbnail-16x9-govt-lands-kabja.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 9, 2024, 10:15 PM IST
YCP Leaders Occupied Government Lands in Nellore District : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైఎస్సార్సీపీ నేతల భూ ఆక్రమణలు పెట్రేగిపోతున్నాయి. అధికారుల అండదండలతో పట్టణంలోని హైవే పక్కనున్న విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. దీనిపై వైసీపీ స్థానిక కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, టిడ్కో భవనాల సమీపంలోని జాతీయ రహదారి పక్కనే పది కోట్ల రూపాయల విలువచేసే మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలాలన్నీ వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి అనుచరులు భూముల రికార్డులను తారుమారు చేసి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు సుధాకర్ రెడ్డి అండదండలతోనే వైసీపీ నేతలు ఈ స్థలాలను కబ్జా చేస్తున్నారని విమర్శించారు.
ఆక్రమించిన స్థలాలను నేతలు రెవెన్యూ రికార్డులను తారు మారు చేసి వారసత్వం కింద తమ పేరుపై ఎక్కించుకుంటున్నారని తెలిపారు. ఇంతటి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలతో అధికారులు కుమ్మకైనట్లు అనుమానం కలుగుతుందన్నారు. ఇప్పటికైన జిల్లా కలెక్టర్ స్పందించి కబ్జాకు గురవుతున్న విలువైన ప్రభుత్వ భూములను కాపాడి, భూ ఆక్రమదారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.