పులివెందులలో వైసీపీకి గుడ్ బై చెబుతున్న నేతలు - బీటెక్ రవి సమక్షంలో టీడీపీలోకి చేరికలు - YCP leaders joining TDP - YCP LEADERS JOINING TDP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 9:55 PM IST
YCP Leaders Joining TDP in kadapa District : జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పరిపాలనలో ప్రజలు పూర్తిగా విసిగిపోయారు. అందుకే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరుతున్నారని పులివెందుల తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి తెలిపారు. కడప జిల్లాలోని వేంపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైసీపీ నుంచి 20 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారందరికీ బీటెక్ రవి కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వేంపల్లి పట్టణంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని తెలిపారు. అలాగే ఇక్కడ ఆగిపోయిన పనులన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
గిడ్డింగివారి పల్లి చెరువు కట్టలో జరిగిన అక్రమాలను త్వరలో బయటపెడతామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చేందాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయి ఆ పార్టీకి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దేశం, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడం తధ్యమని బీటేక్ రవి ధీమా వ్యక్తం చేశారు.