రాజీనామా చేయండి, ప్రచారంలోకి వచ్చి డబ్బులు తీసుకోండి- వాలంటీర్లపై వైసీపీ నాయకుల ఒత్తిడి - volunteers Resignation - VOLUNTEERS RESIGNATION
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 11:59 AM IST
YCP Leaders Forced Resign with Volunteers : సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లను ఈసీ (Election Commission) దూరంగా ఉంచిన నేపథ్యంలో అధికార పార్టీ మరో కొత్త పన్నాగానికి తెరలేపింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడానికి సిద్ధపడ్డారు. వారంతా రాజీనామా చేసి వైసీపీ ప్రచారాల్లో పాల్గొనాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. శ్రీకాకుళం అరసవల్లి మండలంలోని ఓ సచివాలయానికి చెందిన 30 మంది వాలంటీర్లు, గృహసారథులు రాజీనామా చేసి ప్రచారాల్లో పాల్గొనాలంటూ వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పతున్నారు.
Arasavalli Srikakulam District : వాలంటీర్లు రాజీనామా చేసిన అనంతరం వారికి నెలకు వచ్చే వేతనాన్ని తామే అందిస్తామని వైసీపీకి చెందిన జిల్లా యువజన అధ్యక్షుడు మెంటాడ స్వరూప్ పేర్కొన్నారు. రాజీనామా చేయని వారిని మీరెందుకు చేయట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొని జై జగన్ అంటూ నినాదాలు చేయించారు. వైసీపీ ప్రచారాల్లో పాల్గొనేందుకు అదనంగా డబ్బులు కూడా ఇస్తామని ప్రలోభాలకు గురి చేశారు.