టీడీపీ ఎంపీటీసీపై వైసీపీ వర్గీయుల దాడి - కారు అద్దాలు ధ్వంసం, బంగారు గొలుసు, చరవాణీ అపహరణ - YCP Leaders Attacks TDP MPTC - YCP LEADERS ATTACKS TDP MPTC

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 7:56 PM IST

YCP Leaders Attacked on TDP MPTC Member : తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యుడిపై వైసీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. గ్రామ వాలంటీరు సహా ముగ్గురు యువకులు ఎంపీటీసీ నామాలప్పపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంతోపాటు అతడి కారు అద్దాలను ధ్వంసం చేశారు. వివరాల్లోకి వెళ్తే, జిల్లాలోని కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో నామలప్ప టీడీపీ ఎంపీటీసీ సభ్యుడుగా ఉన్నారు. పనిమీద శనివారం అర్థరాత్రి శాంతిపురం నుంచి సి.బండపల్లికి కారులో వెళ్తున్న నామలప్పను రాళ్ల బూదుగురు వద్ద నలుగురు యువకులు అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న సదరు యువకులు నామలప్పను కారులో నుంచి బయటికి లాగి విచక్షణారహితంగా దాడి చేశారు.

అనంతరం అతడి మెడలోని బంగారు గొలుసుతోపాటు సెల్​ఫోన్​ ను లాక్కున్నారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న నామలప్ప పరుగులు తీస్తూ రాళ్ల బూదుగురు పోలీసులకు విషయాన్ని తెలియజేశాడు. పోలీసులు ఘటన స్థాలానికి చెేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దాడికి పాల్పడిన వాలంటీర్ దీలీప్​తో పాటు, మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం నామాలప్ప కుప్పం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.