ఎన్నికల నిబంధన అతిక్రమించిన వైసీపీ ఎమ్మెల్యే - రంజాన్ ప్రార్థనల్లో ప్రచారం - Mekapati Vikram Reddy - MEKAPATI VIKRAM REDDY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 12, 2024, 10:31 AM IST
YCP Leader Mekapati Vikram Reddy Election Camapaign : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వైసీపీ ఎమ్మెల్యే తీరు వివాదాలకు తావిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఎన్నికల నిబంధన అతిక్రమించారు. గురువారం ఆత్మకూరు ఈద్గాలో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రతి మండల కేంద్రంలో షాదీమందిర్ నిర్మిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఆత్మకూరులో షాదీమందిర్ను రూ. మూడు కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ కొంత మంది నినాదాలు చేశారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్న వేళ ఈద్గాలో ప్రచారం నిర్వహించడంపై ముస్లింల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Atmakuru Nellore District : రెండు రోజుల క్రితం ఆత్మకూరు మండలం కరటపాడు గ్రామంలో మేకపాటి విక్రం రెడ్డి రంజాన్ సందర్బంగా ముస్లింలకు ఇఫ్తార్ విందును ఇచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన షామియానాలను మొత్తం వైసీపీ రంగులతో నింపి వేశారు. ఇఫ్తార్ విందుకు వచ్చిన ముస్లింల్లో కొంత మంది పార్టీ కార్యక్రమంగా ఏర్పాటు చేసినట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.