కోడ్‌ను ఉల్లంఘించిన దేవినేని అవినాష్ - ప్రభుత్వ ఆస్తులపై వైసీపీ బ్యానర్లు, జెండాలు - ycp code violation in vijayawada - YCP CODE VIOLATION IN VIJAYAWADA
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 4:21 PM IST
YCP Leaders Code Violation in RTC Bus stand Of Vijayawada : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ పర్వం మెుదలైనప్పటినుంచి వైసీపీ నేతలు అడుగడుగునా కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా వారిలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. తాజాగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కోడ్‌ను విస్మరించారు. ఆయన నామినేషన్ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. నగరంలో రామలింగేశ్వర నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్‌ను వైసీపీ జెండాలు, బ్యానర్లతో నింపేశారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్తులపై పార్టీ బ్యానర్లు, జెండాలు ప్రదర్శించరాదు. అది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుంది. కానీ, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా బస్టాప్ నిండా పార్టీ బ్యానర్లు చుట్టేశారు. అలాగే ప్రయాణికులు కూడా బస్టాండ్‌లో నిలబడేందుకు చోటు లేకుండా బస్టాండ్ మొత్తం వైసీపీ శ్రేణులు జెండాలు పట్టుకుని నిల్చున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దేవినేని అవినాష్ నామినేషన్ కారణంగా అవనిగడ్డ, కృష్ణలంక, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.