పల్నాడులో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ నేతల జులుం- ప్రతిఘటనతో ఇరువర్గాల మద్య ఘర్షణ - YCP Activists Attack on TDP leaders - YCP ACTIVISTS ATTACK ON TDP LEADERS
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2024, 9:30 PM IST
YCP Activists Attack on TDP Leaders in Palnadu District : మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం అవుతున్నప్పటికి తెలుగుదేశం నేతలపై వైసీపీ దాడులను ఆపటం లేదు. తాజాగా పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో వైసీపీ శ్రేణులు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. జిల్లాలోని రెంటచింతలలో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య చెలరేగిన వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే, రెంటచింతలలో టీడీపీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా నిలబడే వారి ఇంటి వద్దకు వెళ్లి వైసీపీ నేతలు బెదిరించారు.
ఈ బెదిరింపులపై టీడీపీ వర్గీయులు ఆ పార్టీ ముఖ్యనేతలకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన టీడీపీ శ్రేణులు బెదిరింపులకు పాల్పడిన వైసీపీ నేతలపై తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థాలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.