వైసీపీ చేసిన అభివృద్ధి ఏమీ లేదు - టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకల దాడి - YCP ACTIVISTS ATTACK ON MAN - YCP ACTIVISTS ATTACK ON MAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 9:43 AM IST
YCP Activists Attack on TDP Activist in Kesupuram: రాష్ట్రంలో వైసీపీ నేతల దాడులు రోజురోజుకు మితిమీరుతున్నాయి. తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పలాస మండలం కేసుపురంలో టీడీపీ కార్యకర్త లక్ష్మణ్ రావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఆ సమూహంలోని కొందరు వైసీపీ కార్యకర్తలు తనతో పాటు ఇంటిపై దౌర్జన్యానికి దిగారని టీడీపీ కార్యకర్త అంబల లక్ష్మణరావు పేర్కొన్నారు.
బాధితుడి తెలిపిన వివరాల ప్రకారం మా గ్రామంలో వైసీపీ ప్రచారం జరుగుతుండగా నేను ఇంట్లోనే ఉన్నాను. కొంతమంది వైసీపీ కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి గతంలో సామాజిక మాధ్యమాల్లో జరిగిన సంభాషణను గుర్తు చేసి ఆ విషయమై నన్ను ప్రశ్నించారు. గౌతు కుటుంబం ఏం అభివృద్ధి చేసిందంటూ విమర్శించారు. మా గ్రామంలో ఇళ్లు, రోడ్లు వేసిందీ గౌతు కుటుంబమే అని బాధితుడు అన్నారు. వైసీపీ ఏమీ అభివృద్ధి చేయలేదని చెప్పడంతో అతనిపై పిడిగుద్దులు కురిపించి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఎక్కడ కనిపించినా చంపేస్తామని తనను బెదిరిస్తున్నారని పోలీసులు రక్షణ కల్పించాలని లక్ష్మణ్ రావు కోరారు.