నీటి సమస్యతో అల్లాడుతున్న ప్రజలు - ట్యాంకర్ నీరు సరిపోవట్లేదని మహిళల ఆవేదన - WOMENS SUFFERING No WATER - WOMENS SUFFERING NO WATER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 6:11 PM IST

Womens Suffering From Water Problem in Kakinada: కాకినాడలో తాగునీటి కొరతతో ఒకటో వార్డు నుంచి 13వ వార్డుల్లో నివసిస్తున్న ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. దీనికి తోడు తాగునీటి పైపు లీకేజీ కావడంతో సమస్య మరింత జఠిలమైంది. మరమ్మతులు చేసేందుకు కుళాయిల ద్వారా నీటి సరఫరాను నిలిపివేశారు. నాలుగు రోజులుగా నీరు రాక జనం దాహం కేకలు పెడుతున్నారు. కొన్ని రోజులు కుళాయిలు రావని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. 

Scarcity of Drinking Water: దుమ్మలపేటలో ఒకే ఒక్క ట్యాంకర్ ద్వారా వచ్చే నీటి కోసం కాలనీల్లోని మహిళలంతా ఒకేసారి ఎగబడ్డారు. నీటి కోసం బిందెలు తీసుకుని వచ్చి ఒకరినొకరు తోసుకుంటూ రావడంతో తోపులాట జరిగింది. నాలుగు రోజుల నుంచి నీళ్లు రాకపోగా ఒక్క ట్యాంకర్​ను మాత్రమే అధికారులు పంపిస్తే ఎలా సరిపోతాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ ద్వారా వచ్చే నీరు ఏ మూలకు సరిపోవట్లేదని మహిళలు చెబుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.