స్థలం కబ్జా చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్- పవన్ కార్యాలయం ఎదుట బాధితురాలి ఆత్మహత్యాయత్నం - Women Suicide Attempt - WOMEN SUICIDE ATTEMPT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 2:34 PM IST

Women Suicide Attempt Before Pawan Kalyan Camp Office : వైఎస్సార్సీపీ కార్పొరేటర్ తన స్థలాన్ని ఆక్రమించారంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయం ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన మేడిశెట్టి దుర్గాదేవి రాజమహేంద్రవరంలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఉన్న తన 1200 గజాల స్థలాన్ని స్థానిక కార్పొరేషన్ విజయలక్మి ఆక్రమించారని దుర్గాదేవి ఆరోపించారు. కార్పొరేటర్ విజయలక్మి, ఎన్​ఎన్​కే రెడ్డి అనే వ్యక్తి సాయంతో స్థలాన్ని ఆక్రమించిందని బాధితురాలు పేర్కొన్నారు.

అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలంటూ పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చిన దుర్గాదేవి పవన్​ను కలవలేదు. కానీ కార్యాలయం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న పోలీస్ క్వార్టర్స్ ఆమె పైకి ఎక్కారు. అక్కడ నుంచి దూకుతానని దుర్గాదేవి బెదిరించారు. దీంతో పోలీసులు వెంటనే పైకి ఎక్కి ఆమెను కిందకు దింపి స్టేషన్​కు తరలించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.