శ్రీ సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చుతున్న తాగునీటి సమస్య- జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు - Water Problem in Satyasai
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 3, 2024, 4:56 PM IST
Women Protest to Solve Water Problem in Satyasai District : వేసవికాలం ప్రారంభం కాకముందే రాష్ట్రంలో నీటి సమస్యలు తీవ్ర రూపం దాల్చింది. శ్రీ సత్య సాయి జిల్లాలో నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చిన్నారులు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. చిలమత్తూరు మండలం మరువ కొత్తపల్లి బీసీ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు సర్పంచ్, అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో హిందూపురం వెళ్లే జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించి నిరసన తెలిపారు.
Kothapally Womens Protest in National Highway : మహిళల ఆందోళన వల్ల జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తమ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించమని సృష్టం చేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న చిలమత్తూరు ఎస్సై సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజుల్లో పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.