కుటుంబ కలహాలు - భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య - WIFE KILLED HER HUSBAND - WIFE KILLED HER HUSBAND

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2024, 3:06 PM IST

Wife Killed Her Husband in East Godavari District : కుటుంబ కలహాలతో భర్తను భార్య కత్తెరతో పొడిచి చంపిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఉండ్రాజవరం మండలం రెడ్డిచెరువులో శ్రీనివాసరావు, ఆయన భార్య రాణి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. అదే తరహాలో మంగళవారం రాత్రి గొడవ జరిగింది. ఈ సమయంలో రాణి తన భర్త శ్రీనివాసరావు గుండెలపై కత్తెరతో పొడిచింది. దీంతో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు సోదరుడు తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు భార్యపై భారతీయ న్యాయ సంహిత (302 సెక్షన్) కింద కేసు నమోదు చేశామని ఉండ్రాజవరం సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు. హత్యకు సంబంధించిన కారణాలను బాధితులను విచారించి తెలుసుకుంటామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను త్వరలో తెలుపుతామని వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.