నీటి కటకట - తాగునీటి కోసం ఒంగోలు వాసుల ఇక్కట్లు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 19, 2024, 3:30 PM IST
Water Problems in Ongole : వేసవి వచ్చిందంటే గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో నీటి కష్టాలు మాములే. కానీ జిల్లా కేంద్రమైన ఒంగోలులో నగర ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడటం నగరపాలక సంస్థ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నగరంలోని పలు కాలనీలకు నీటి సరఫరా లేకపోవడంతో వారం రోజులకు ఒక్కసారి వచ్చే ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కనీస అవసరాలకు కూడా నీరు చాలక కాలనీవాసులు అల్లాడిపోతున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోల్లో పీర్లమాన్యం కాలనీ ప్రజలు త్రాగునీటి కష్టాలతో ఇబ్బంది పడుతున్నారు. నగర పాలక సంస్థ ద్వారా వారానికి ఒకసారి ట్యాంకర్లతో నీటి సరఫరా చేయటంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కాలంలో ఎన్ని ఇబ్బందులు వస్తాయో అని స్థానికులు ఆవేదన వ్యక్తం వేస్తున్నారు. వారానికి ఒకరోజు నీటి సరఫరా చేయటం వల్ల ఇంటికి రెండు లేదా మూడు డ్రమ్ములు మాత్రమే అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అవి కూడా చిన్న ట్యాంకర్లతో (tanker) నీటి సరఫరా చేయటం వల్ల ఆ నీటిని ఇంట్లో అవసరాలకు వినియోగించుకోవాలా లేదా తాగాలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ కాలనీలో ట్యాంకు కట్టారు కానీ తాత్కాలికంగా ప్రారంభించి వదిలేసారని చెబుతున్నారు. కనీసం వారంలో రెండు, మూడు రోజులు తాగడానికి ట్యాంకర్ల ద్వారా నీరు పంపించినా చాలు తమ కష్టాలు తీరుతాయని కాలనీవాసులు కోరుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ పట్టించుకుని పీర్ల మన్యం కాలనీలో త్రాగు నీటి కష్టాలు తీర్చాలని కాలనీవాసులు కోరుతున్నారు.