వైఎస్సార్సీపీ ప్రచారకర్తలుగా వాలంటీర్లు- ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతర్ - collector rules ignored by YSRCP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 13, 2024, 1:12 PM IST

Volunteers Doing YSRCP Political Campaign: రాజకీయ కార్యక్రమాల్లో వాలంటీర్లను భాగస్వాములు చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హెచ్చరిస్తున్నా సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నారు. అధికార పార్టీ (Ruling Party) తరఫున వాలంటీర్లు ప్రచార కార్యక్రమాల్లో అత్యుత్సాహం కనబరుస్తున్నారు.

Volunteers Distributing pamplets Wearing YSRCP Scarves: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి (YSRCP Candidate Mettu Govinda Reddy) తరఫున వాలంటీర్లు ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ కండువాలు కప్పుకుని కరపత్రాలను పంచుతున్నారు. కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో వాలంటీర్లు రాజశేఖర్, శ్రీనాథ్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్న ఆదేశాలను వైఎస్సార్సీపీ నేతలు పెడచెవిన పెడుతున్నారని, వాలంటీర్లు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అనంతపురం జిల్లా విడపనకల్లులో మంగళవారం జరిగిన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవంలో మండలానికి చెందిన పలువురు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వారితో కలిసి ఒక ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కూడా ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.