అధికార పార్టీ కక్ష - కుమారులు టీడీపీలో చేరారని తండ్రి పింఛన్​ నిలిపివేత - టీడీపీలో చేరితే పింఛన్​ నిలిపివేత

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 3, 2024, 11:44 AM IST

Volunteer Stopped  Pension in Anantapur District : అర్హతలున్నా అధికార పార్టీ వివక్ష పింఛన్​దారుల పాలిట శాపంలా మారింది. తనయులు టీడీపీలో చేరారంటూ తండ్రి పింఛన్​ను ఆపేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. విడపనకల్లు మండలంలోని చీకలగురికి గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు రామాంజనేయులు గత కొన్నేళ్లుగా పింఛను అందుకుంటున్నారు. అయితే ఇటీవల ఆయన కుమారులు పయ్యావుల శ్రీనివాసుల సమక్షంలో టీడీపీలోకి చేరారు. దీంతో వైసీపీ నాయకులు ఆయనకు పింఛను ఇవ్వకుండా అడ్డు పడ్డారు. వారి మాటలకు కట్టుబడి గ్రామ వాలంటీరు లబ్ధిదారుకు పింఛన్​ ఇవ్వకుండా నిలిపేశారు. 

పింఛను ఇవ్వాలని బాధితుడు వాలంటీరును కోరగా తన వద్దకు ఉదయం రా, మధ్యాహ్నం రా అంటూ వాలంటీరు తన ఇంటి చుట్టూ తిప్పుకున్నారు.  చివరకు నీ కుమారులు టీడీపీలో చేరారు. దీంతో నీకు పింఛన్​ ఇవ్వలేనంటూ వాలంటీరు నిరాకరించారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి అబ్దుల్​ మునాష్​ దృష్టికి తీసుకెళ్లగా లబ్ధిదారులందరికీ పింఛను అందించాలని వాలంటీరును ఆదేశించారు. రామాంజనేయులుకు ఎందుకు పింఛన్​ ఇవ్వలేదన్న విషయంపై విచారణ చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.