'జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జగన్ మోసం'- టీడీపీలో చేరిన వాలంటీర్ - Resigned Volunteer Post Joined TDP - RESIGNED VOLUNTEER POST JOINED TDP
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-03-2024/640-480-21044699-thumbnail-16x9-resigned-from-volunteer-post-joined-tdp.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 22, 2024, 10:38 AM IST
Volunteer Resigned From Post Joined TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెరుగుతున్నాయి. సీఎం జగన్ సైనికులైన వాలంటీర్లు సైతం వైసీపీను వీడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం సుద్ధకుంటపల్లిలో శ్రీకాంత్ అనే వాలంటీర్ తన పదవికి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి సవితా అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సీఎం జగన్ ఐదు సంవత్సరాలుగా యువతను వంచిస్తూ వచ్చారని శ్రీకాంత్ మండిపడ్డాడు. గ్రామంలో 40 మంది డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉండగా కనీసం ఒక్కరికి కూడా ఉద్యోగం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి ఇప్పటికే పలువురు నేతలు, వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరుతున్నాయి. సీఎం జగన్ అవినీతి పాలన భరించలేక పార్టీ వీడుతున్నట్లు పలువురు నేతలు అంటున్నారు. ఇప్పటికే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లను ఈసీ అధికారులు సస్పెండ్ చేశారు.