ఎంపీ అక్రమాలపై వాలంటీర్ పోరాటం - నందిగం సురేష్‌పై పోటీ - Volunteer Contesting election - VOLUNTEER CONTESTING ELECTION
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 10:46 AM IST
Volunteer Contesting YCP Rebel Candidate in Lok Sabha Election : అధికార పార్టీకి చెందిన ఎంపీ నందిగం సురేష్ అక్రమాలు, అరాచకాలకు వ్యతిరేకంగా చీరాలకు చెందిన ఆనంద్‌బాబు తన వాలంటీర్ పదవికి రాజీనామా చేసి బాపట్ల లోక్‌సభ వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎక్కడో తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడుపుతున్న నందిగం సురేష్ వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ఆనంద్‌బాబు ప్రశ్నించారు.
బాపట్ల ఎంపీగా గెలిచిన నందిగం సురేష్ గత అయిదేళ్లలో ప్రజలకు కనిపించకుండా, వారి సమస్యలు పట్టించుకోకుండా అక్రమార్జనే ధ్యేయంగా పని చేశారని వాలంటీర్ ఆనంద్ బాబు ఆరోపించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధి కోసం ఉద్దండరాయునిపాలెం వెళ్లి ఎంపీ నందిగం సురేష్ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగం సురేష్ అక్రమార్జనలకు అడ్డుకట్ట వేసేందుకు ఎంపీగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు.