కనీస వేతనం, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలంటూ వెలుగు ఉద్యోగులు ఆందోళన - వెలుగు ఉద్యోగులు ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 11:39 AM IST
VOA employees protest in Andhra Pradesh : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు ఉద్యోగులు ఆందోళన దిగారు. కనీస వేతనం, రిటైర్మెంట్ బెన్ఫిట్స్ ఇవ్వాలని పలు జిల్లాల్లోని కలెక్టరేట్‌ల ఎదుట నిరసన తెలిపారు. రాజకీయ వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నెల్లూరులో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పాదయాత్రలో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మోసం చేశారని నంద్యాలలో ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన తెలిపారు.
శ్రీకాకుళంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, రూ. 10 లక్షల గ్రూపు ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాలని, స్వావలంబన నగదును తిరిగి సభ్యులకు చెల్లించాలని, గుర్తింపు కార్డుల ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం విడుదల చేసిన 3 ఏళ్ల కాల పరిమితితో కూడిన సర్క్యులర్‌ను తక్షణమే రద్దు చేయాలంటూ అనకాపల్లి లో ఉద్యోగులు ధర్నా చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.