సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు - శేషవాహనంపై శ్రీవారి ఊరేగింపు - SAINT LOUIS TEMPLE BRAHMOTSAVAM - SAINT LOUIS TEMPLE BRAHMOTSAVAM
🎬 Watch Now: Feature Video
Published : May 26, 2024, 10:12 AM IST
|Updated : May 26, 2024, 2:50 PM IST
Saint Louis Hindu Temple Brahmotsavam 2024 : అమెరికా సెయింట్ లూయిస్లోని స్థానిక హిందూ దేవాలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు ఈ నెల 28వ తేదీన ముగియనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శనివారం రోజున శేషవాహనంపై శ్రీవారిని ఘనంగా ఊరేగించారు. అనంతరం ఏర్పాటు చేసిన గరుడ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఐదు రోజుల పాటు ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాతం, తోమాల సేవ తిరు ఆరాధన గజవాహన సేవ వంటి క్రతువులను నిర్వహించనున్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. బ్రహ్మోత్సవం అనేది హిందూ ధార్మిక పరిణతిలో ఒక ప్రముఖమైన ఉత్సవమని, దేవతల కృప భక్తులకు సమృద్ధిగా లభించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.
శనివారం సాయంకాలం కార్యక్రమాల్లో అగ్నిప్రతిష్ఠ, వుక్తహోమ కార్యక్రమం చేశారు. ఈ ఐదు రోజుల వేడుకల్లో 30వేల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సెయింట్ లూయిస్ స్థానిక ప్రవాసుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో స్థానికులు స్వామివారి ఊరేగింపునకు అవసరమైన ప్రత్యేక రథాన్ని తయారు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ సాక్షి, బ్రహ్మోత్సవాల కమిటీ కార్యదర్శి మురళీ పుట్టగుంట తదితరులు పాల్గొన్నారు.