గులకరాయి దాడి జగన్నాటకమే!: వర్ల రామయ్య - stone attack incident - STONE ATTACK INCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 18, 2024, 5:11 PM IST

Varla Ramaiah on stone attack: జగన్ పై హత్యాయత్నం అనేది జగన్మోహన్ రెడ్డి ఆడిన జగన్నాటకం ఇదో పెద్ద డ్రామా అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, తాను అధికారంలోకి రావాలని జగన్ చేసిన నాటకమే ఈ బూటకపు హత్యా ప్రయత్నమని ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి, వివేకా హత్యను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అదే మిషతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్యా యత్నం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

పోలీసు కమిషనర్, సాక్షి పత్రిక ఒకటేనా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు. పోలీసుల దర్యాప్తు అంతా సాక్షి పత్రికలోనే వస్తోందని ఆరోపించారు. బొండా ఉమా గెలుస్తున్నారు, వెల్లంపల్లి పలాయనం చిత్తగిస్తున్నారని తెలుసుకొని ఈ డ్రామాకు తెరలేపారన్నారు. సాక్షి తప్పుడు కథనాలు అల్లుతుంటే దానికి పోలీసు అధికారులు జీ హుజూర్ అనటం సబబా అని ప్రశ్నించారు. గులకరాయి దొంగ నాటకం ప్రజలకు తెలిసిపోవడంతో వైసీపీ నాయకులు మౌనం వహించారని ఆక్షేపించారు.
 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.